లో దుస్తుల్లో బంగారం, ఎయిర్ హోస్టెస్ అరెస్ట్ (పిక్చర్స్)
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. బుధవారం ఒక్కరోజే 15 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులకు చేతికి చిక్కింది. పట్టుబడిన బంగారం విలువ కోట్లలో ఉంటుంది. బుధవారం తెల్లవారుజాము నుంచి జరిపిన తనిఖీల్లో ఓసారి 2.75 కిలోలు, మరోసారి ఏకంగా 13 కిలోల బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి.
తనిఖీల్లో పట్టుబడిన వారిద్దరు మహిళలు కావడం గమనార్హం. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు లోదుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకెళ్తుండగా విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 13 కిలోల బంగారం స్మగ్లింగ్ విషయమై పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు.
ఇందుకు సంబంధించి ఎయిర్ హోస్టెస్‌తో పాటు బంగారం స్మగ్లింగ్ చేయించిన వ్యక్తిని అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ కేసులో సూత్రధారి సౌజత్ అలీ ఎయిర్ హోస్టెస్‌తో బంగారం స్మగ్లింగ్ చేయించినట్లు ఆధారాలు సేకరించిన కస్టమ్స్ అధికారులు దుబాయిలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ హోస్టెస్‌ను సదా ఖాన్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

బంగారం
కాగా, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు లోదుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకెళ్తుండగా విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని సాయంత్రం నగరంలోని కస్టమ్స్ కార్యాలయంలో హైదరాబాద్ జోన్ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బిబి ప్రసాద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు.

బంగారం
ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఓ మహిళ దోహా నుంచి ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. సదరు మహిళ తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఆమె బ్యాగును తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన వ్యక్తిగత తనిఖీల్లో మహిళ వద్ద కిలో బంగారం రాడ్లతోపాటు ఒక్కొక్కటి పది తులాలుండే మరో ఆరు రాడ్లు బయటపడ్డాయి.

బంగారం
ఈ తనిఖీల్లో 78 లక్షల విలువైన 2.7 కిలోల బంగారం పట్టుబడింది. అలాగే ఉదయం 10 గంటలకు దుబాయి నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో మరో మహిళ విమానాశ్రయానికి చేరుకుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న సదరు మహిళను ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు తనిఖీ చేయగా ఆమె దుస్తుల్లో ఒక్కొక్కొటి కిలో బరువుండే 13 బంగారం బిస్కెట్లు దొరికాయి. వీటి విలువ కోట్లలో ఉంటుంది. తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చీఫ్ కమిషనర్ బిబి ప్రసాద్ తెలిపారు.

బంగారం
ఎన్నికల వేళ ఇద్దరు మహిళల వద్ద భారీ మొత్తంలో బంగారం పట్టుబడడంతో దీని వెనక కుట్ర ఉండుంటుందా? అన్న కోణంలో విచారణ చేపట్టామన్నారు. త్వరలోనే కేసు పూర్తి వివరాలు కనుగొంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications