Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్ళికి లక్ష రూపాయాల' రద్దు 'చేసిన నగదు నోట్ల కానుక

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని చీపురుగూడెంల్ రెండు రోజుల క్రితం ఓ యువకుడి వివాహం జరిగింది. ఈ వివాహంలో లక్ష రూపాయాల నగదు కానుకల రూపంలో వచ్చింది. ఈ నగదు అంతా రద్దు చేసిన నోట్లు కావడంతో ఇబ్బంది

పశ్చిమగోదావరి జిల్లా :పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహరం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కొందరకు ఏకంగా రద్దు చేసిన నగదును కానుకల రూపంలో చెల్లించకూడదని విన్నవించినా ఫలితం లేకపోయింది. మరో వైపు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహంలో లక్ష రూపాయాలు రద్దు చేసిన నగదు కానుకల రూపంలో వచ్చింది. ఈ నగదును ఏం చేయాలో దిక్కుతోచక పెళ్ళి కొడుకు కుటుంబం ఆందోళన చెందుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని చీపురుగూడెంలో ఓ వ్యక్తి వివాహం వారం రోజుల క్రితం జరిగింది. ఈ వివాహనికి బందువులు, స్నేహితులు, సన్నిహితుల నుండి కానుకల రూపంలో పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. అయితే ఇందులో లక్ష రూపాయాలు రద్దు చేసిన నగదు కావడం విశేషం.

 1 lakh banned currecncy gift for marrage

పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత కష్టాలు పడి మరీ ఈ వివాహం జరపించారు పెద్దలు. అయితే వివాహం .పూర్తైన తర్వాత ఈ కుటుంబానికి పెద్ద నగదు నోట్ల రద్దు కష్టాలు తప్పలేదు. వివాహనికి వచ్చిన అతిథులు ఇచ్చిన నగదులో అత్యధికంగా రద్దు చేసిన నగదు మాత్రమే ఉంది.

రద్దు చేసిన నగదు కరెన్సీలో ఐదు వందలు, వెయ్యి రూపాయాల నగదు మాత్రమే ఉన్నాయి. ఈ కరెన్సీని మార్పిడి చేసుకోనేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పెళ్ళి కొడుకు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+