ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు: 67 మంది మృతి, లక్షా 86వేలకుపైగానే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా 10వేల కంటే తక్కువగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మళ్లీ బుధవారం 10వేల కేసులు దాటాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 86వేలు దాటాయి.

లక్షా 86వేలకుపైగా కరోనా కేసులు

లక్షా 86వేలకుపైగా కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 10,128 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,86,461 చేరింది. కాగా, కొత్తగా కరోనాతో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1681కి చేరింది. బుధవారం 8729 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 80,426 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా మృతులు

జిల్లాల వారీగా కరోనా మృతులు


రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,04,354 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల గుంటూరులో 16 మంది, విశాఖపట్నంలో 12, శ్రీకాకుళంలో 10, చిత్తూరులో 8, తూర్పుగోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు

ఇక కొత్త కరోనా కేసులు జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 1260, చిత్తూరులో 677, తూర్పుగోదావరిలో 1544, గుంటూరులో 730, కడపలో 729, కృష్ణాలో 440, కర్నూలులో 1368, నెల్లూరులో 537, ప్రకాశంలో 349, శ్రీకాకుళంలో 405, విశాఖపట్నంలో 842, విజయనగరంలో 665, పశ్చిమగోదావరిలో 582 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 22లక్షలకుపైగా కరోనా పరీక్షలు

ఏపీలో 22లక్షలకుపైగా కరోనా పరీక్షలు

గత 24 గంటల్లో 60,576 నమూనాలను పరీక్షించగా.. 10వేల కేసులు నిర్ధరణ అయ్యాయి.ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,35,626 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
19,59,468కి చేరింది. 5,93,721 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 13,24,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 40,729 మంది కరోనా బారిన పడి మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+