APSRTC: శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో రాయితీ..!
ఏపీఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్ లపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్ టికెట్లపై 10 శాతం రాయితీ రానుంది. ఉదాహరణకు టికెట్ ధర రూ.1,500 ఉంటే.. మీకు రూ.150 తక్కువ పడుతుంది.
అంటే మీరు రూ. 1,350 చెల్లిస్తే సరిపోతుంది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని మార్గాల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ 30 వరకే రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ పెరుగుతోంది.

తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాగా.. తెలంగాణలో ఇంకా కార్పొరేషన్ గా కొనసాగుతోంది. తెలంగాణలో ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications