తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

33 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుపతిలో: సుజనా, 9 మంది నోబెల్ గ్రహీతలు వస్తారు

|
Google Oneindia TeluguNews

తిరుపతి/న్యూఢిల్లీ: తిరుపతిలో 33 ఏళ్ల తర్వాత మరోసారి ఇండియన్ కాంగ్రెస్ సైన్స్ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి సోమవారం నాడు ఢిల్లీలో చెప్పారు. దీనికి సుమారు 9 మంది నోబెల్ గ్రహీతలు హాజరవుతారని ఆయన తెలిపారు. 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై తొలి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

అనంతరం సుజన మీడియాతో మాట్లాడారు. 2017 జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో విద్యార్థులను భాగస్వాముల్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. వారినికోసారి ఈ సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షిస్తామన్నారు.

sujana choudhary

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ, మంత్రి గంటా శ్రీనివాస రావులు కూడా మాట్లాడారు. ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్‌లో పదిహేను వేల మంది పాల్గొంటారన్నారు. తొమ్మిది మందికి పైగా నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు కూడా ఈ సదస్సుకు హాజరవుతారన్నారు.

సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణలో ఎవరి బాధ్యతలు ఏమిటో ఈ సమావేశంలో ఓ స్పష్టతనిచ్చారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగానే ప్లీనరీ సెషన్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధిలోనే ఐటీ విజ్ఞానం అనే అంశాన్ని థీమ్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సదస్సు నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయన్నారు.

English summary
104th Indian Science Congress Will Be Held in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X