ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: శ్రీకాకుళంలో అత్యల్పం, గుంటూరులో అత్యధికం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ.. భారీగా తగ్గుదల నమోదు చేయడం గమనార్హం. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య పాజిటివ్ కేసుల సంఖ్య కంటే రెట్టింపు ఉంది.

ఏపీలో కొత్తగా 1056 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 53,215 నమూనాలను పరీక్షించగా 1056 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,54,011కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 14 మంది కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6868కి చేరింది.

ఏపీ జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు
ఇక ఏపీ జిల్లాలవారీగా కరోనా కొత్త పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 70, చిత్తూరులో 87, తూర్పుగోదావరిలో 139, గుంటూరులో 206, కడపలో 47, కృష్ణాలో 153, కర్నూలులో 27, నెల్లూరులో 30, ప్రకాశంలో 37, శ్రీకాకుళంలో 24, విశాఖపట్నంలో 57, విజయనగరంలో 25, పశ్చిమగోదావరిలో 154 కేసులు నమోదయ్యాయి.

20వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
గత 24 గంటల వ్యవధిలో 2140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,28,484కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,659 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 91,54,263 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో 50వేల దిగువనే కరోనా కేసులు..
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఏడో రోజు 50 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,05,589 పరీక్షలు జరపగా, కొత్తగా 41,100 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది. వీరిలో 82,05,728 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 42,156 మంది కోలుకున్నారు. 447 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,29,635కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,79,216 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications