నిరుద్యోగులకు శుభవార్త: 11,735 అంగన్ వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఏపీలో మహిళా నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా 11,735 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని మంత్రి పీతల సుజాత బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్ వాడీ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగినా పీడీలే పూర్తి బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు. గతంలో లంచాలు తీసుకొని అంగన్ వాడీ నియామకాలను నచ్చిన వారికి ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

11,735 anganwadi posts sanctioned in andhra pradesh

ఈ నేపథ్యంలో అంగన్ వాడీ నియామకాల్లో తేడాలు వచ్చినా, లంచాలు తీసుకుని పోస్టులు భర్తీ చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాలకు చెందిన పీడీలే భర్తీ చేస్తారని ఆమె తెలిపారు. ఈ మొత్తం విధానాన్ని కలెక్టర్లు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రులు పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్‌ఎంఎస్‌ ఉద్యమం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్‌ఎంఎస్‌ ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, నగరాధ్యక్షుడు మల్లాది విష్ణులు ప్రారంభించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహా కేంద్రమంత్రులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా నిరసన తెలిపాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+