ఏపీలో కొత్తగా 1171 కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం, అనంతపురంలో అత్యల్పం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. తాజాగా, 1100కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,251 నమూనాలను పరీక్షించగా.. 1171 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1171 కరోనా కేసులు, 11 మంది మృతి
తాజాగా నమోదైన 1171 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,43,244కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 11 మంది మృతి చెందారు.
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించగా, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,108కి పెరిగింది.

ఏపీలో 13,749 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1207 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,15,387కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 13,749 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,79,25,469 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 255 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 06 కొత్త కరోనా కేసు నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 06, చిత్తూరులో 158, తూర్పుగోదావరిలో 255, గుంటూరులో 101, కడపలో 48, కృష్ణాలో 147, కర్నూలులో 07, నెల్లూరులో 145, ప్రకాశంలో 141, శ్రీకాకుళంలో 09, విశాఖపట్నంలో 45, విజయనగరంలో 15, పశ్చిమగోదావరిలో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,90,091, చిత్తూరులో 2,42,747 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,713) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ, తాజాగా, 31వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు మాత్రం 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,27,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,923 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లకుపైగా పెరిగింది. బుధవారం 282 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.46లక్షలకు పెరిగింది. మంగళవారం 31వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.28కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.77 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,01,640 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.90 శాతంగా ఉంది. బుధవారం 71,38 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 83.39 కోట్లకు చేరింది.












Click it and Unblock the Notifications