ఏపీలో కరోనావైరస్: 20 లక్షల దాటిన రికవరీలు: 15వేలు దాటిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. . తాజాగా, 1000కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 45,533 నమూనాలను పరీక్షించగా.. 1190 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1190 కరోనా కేసులు, 11 మంది మృతి

ఏపీలో కొత్తగా 1190 కరోనా కేసులు, 11 మంది మృతి

తాజాగా నమోదైన 1190 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,29,985కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 11 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,998కి పెరిగింది.

ఏపీలో 15,110 యాక్టివ్ కేసులు, 20 లక్షల దాటిన రికవరీలు

ఏపీలో 15,110 యాక్టివ్ కేసులు, 20 లక్షల దాటిన రికవరీలు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1226 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,00,877కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 15,110 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,73,24,895 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 219 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 19, చిత్తూరులో 219, తూర్పుగోదావరిలో 83, గుంటూరులో 117, కడపలో 69, కృష్ణాలో 164, కర్నూలులో 10, నెల్లూరులో 139, ప్రకాశంలో 121, శ్రీకాకుళంలో 48, విశాఖపట్నంలో 65, విజయనగరంలో 22, పశ్చిమగోదావరిలో 114 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,87,832, చిత్తూరులో 2,40,695 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,608) కరోనా కేసులున్నాయి.

Recommended Video

    వినాయక విగ్రహాల ధరలతో బెంబేలెత్తుతున్న భక్తులు!!
    దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు

    దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు

    దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30వేల దిగువకు కొత్త కేసులు కాస్త ఊరటనిస్తోంది. మరణాలు మాత్రం 300పైనే ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. దేశంలో సగం కంటే ఎక్కువ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కేరళలో నిన్న 20,487 కరోనా కేసులు నమోదు కాగా, 181 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,30,125 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం 338 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,42,655కి చేరింది. ఇక నిన్న 34,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,24,09,345కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,84,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.16 శాతంగా ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+