ఏపీ భవన్ శ్రీవారి హుండిలో 12 బంగారు బిస్కెట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హుండీలో పన్నెండు బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. గురువారం హుండీని లెక్కించారు. ఇందులో ఒక్కొక్కటి వంద ఇరవై గ్రాముల చొప్పున బరువు ఉన్న బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి.
రూ.16 లక్షల నగదు లభించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ఈ హుండీ ద్వారా మొత్తం రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సారి ఢిల్లీలోనిగోల్ మార్కెట్లో కూడా ఆలయం నిర్మించారు. దీంతో, ఇక్కడి హుండీ ఆదాయం రూ.30 లక్షలు వచ్చింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు రాఘవేంద్ర రావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మలు గురువారం దర్శించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.
29 నుండి పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 29 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. గురువారం తెప్పోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతి రోజు సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఏడున్నర వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు.












Click it and Unblock the Notifications