సంక్రాంతికి విశాఖ, విజయవాడ వాసులకు రైల్వే అదిరిపోయే వార్త!
తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగకు ప్రయాణాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో రద్దీ కొనసాగుతుంది. రైళ్లు, బస్సులు, కార్లు, టూవీలర్లు ఇలా విభిన్న మార్గాల ద్వారా ప్రయాణాలు చేస్తూ తమ సొంత ఊర్లకు చేరుకుని పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా ఇప్పటికే అందరూ తమ తమ సొంత ఊర్లకు చేరుకుంటున్నారు.
విశాఖ, విజయవాడ మార్గంలో జన సాధారణ్ రైళ్ళు
దీంతో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల అవసరాలరీత్యా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే, రద్దీని బట్టి మరికొన్ని రైళ్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం మార్గంలో మొత్తం 12 జన సాధారణ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తాజాగా ప్రకటించింది.

ఈ తేదీలలో అందుబాటులోకి జన సాధారణ్ ప్రత్యేక రైళ్ళు
జనవరి 13, 14, 16, 17, 18 తేదీలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 12 గంటల 35 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటాయి. ఇక విశాఖపట్నం నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకుంటాయి.
ఈ స్టేషన్ ల మీదుగా నడవనున్న రైళ్ళు
ఇవి మార్గమధ్యంలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని , అన్నవరం, సామర్లకోట, నిడదవోలు, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇవి మాత్రమే కాకుండా చర్లపల్లి నుండి అనకాపల్లి వరకు జనవరి 18, 19 తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే cpro శ్రీధర్ వెల్లడించారు.
చర్లపల్లి నుండి అనకాపల్లికి కూడా ప్రత్యేక రైళ్ళు
ఈ రైళ్ళు రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ వంటి స్టేషన్లలో ఆగుతాయి.మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగను దక్షిణాది ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కోసం అవసరాన్ని బట్టి రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులను కల్పిస్తూ పండుగను ఘనంగా చేసుకునేలా గమ్యస్థానాలకు చేరుస్తుంది.












Click it and Unblock the Notifications