ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: 13వేలకుపైగా కొత్త కేసులు, 9 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 41,771 నమూనాలను పరీక్షించగా.. 13,474 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

గత 24 గంటల్లో 10,290 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కడప జిల్లాలో అత్యధికంగా 2031 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 2,23,25,140 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్ కేసులకు గానూ, 21,09,080 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. 14,579 మంది మరణించారు.

13,474 new coronavirus cases reported in andhra pradesh in 24 hours

కరోనా కారణంగా విశాఖపట్టణంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు తాజా బులెటిన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10,290 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,23,25,140 శాంపిల్స్ పరీక్షించారు.

జిల్లాల వారీగా కరోనా వైరస్ కొత్త కేసులను గమనించినట్లయితే... అనంతపురం 980. చిత్తూరు 328. తూర్ప గోదావరి 1066. గుంటూరు 1342. కడప 2031. కృష్ణా 873. కర్నూలు 1835. నెల్లూరు 1007. ప్రకాశం 1259. శ్రీకాకుళం 259. విశాఖపట్టణం 1349. విజయనగరం 469. పశ్చిమగోదావరి జిల్లాలో 676 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 573 మంది మృతి చెందారు. దేశంలో 5.46 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 19.59 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,03,71,500 కేసులు, 4,91,700 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 3,76,77,328 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+