ఏపీలో కొత్తగా 1378 కరోనా కేసులు, 10 మరణాలు: తగ్గిన రికవరీ, పెరిగిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. ఓ రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువగా కేసులు ఉంటున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 59,566 నమూనాలను పరీక్షించగా.. 1378 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1378 కరోనా కేసులు, 10 మంది మృతి

ఏపీలో కొత్తగా 1378 కరోనా కేసులు, 10 మంది మృతి

తాజాగా నమోదైన 1378 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,16,680కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు.

అత్యధికంగా కృష్ణా జిల్లాలో నలుగురు మరణించగా, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,877 మృతి చెందారు.

ఏపీలో 14,702 యాక్టివ్ కేసులు

ఏపీలో 14,702 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1139 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,88,101కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 14,702 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,67,45,035 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 242 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరం జిల్లాలో 13 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 22, చిత్తూరులో 219, తూర్పుగోదావరిలో 242, గుంటూరులో 101, కడపలో 61, కృష్ణాలో 178, కర్నూలులో 15, నెల్లూరులో 166, ప్రకాశంలో 119, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 69, విజయనగరంలో 13, పశ్చిమగోదావరిలో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,86,081, చిత్తూరులో 2,38,557 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,449) కరోనా కేసులున్నాయి.

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే

ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 47వేలు దాటగా, మరణాలు 500పైనే నమోదయ్యాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో ఉండటం రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. అయితే, 70 శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47,092 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. తాజాగా, 509 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,39,529కు పెరిగింది. బుధవారం 35,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.20 కోట్ల మందికి చేరింది. రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది. మరోవైపు, కేరళలో రాష్ట్రంలోనే దేశంలో సగానికిపైగా ఇక్కడే కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 32,803 కొత్త కేసులు వెలుగుచూశాయి. బుధవారం 173 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,89,583 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.19 శాతానికి పెరిగింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. బుధవారం 81 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు 66 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+