ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికంగా, కర్నూలులో అత్యల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా పరీక్షలు భారీగా చేసినప్పటికీ.. 2 వేల లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, మరణాల సంఖ్య కూడా తగ్గింది. కోలుకున్నవారి సంఖ్య కొత్త కరోనా కేసుల కంటే ఎక్కువగానే ఉంది. ఈ మేరకు వివరాలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1392 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1392 కరోనా కేసులు

గత 24 గంటల్లో 61,050 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 1392 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8,44,359కి చేరింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6802కు చేరింది. కాగా, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కడపలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

ఏపీలో 21,235 యాక్టివ్ కేసులు

ఏపీలో 21,235 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో 1549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,41,464కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,235 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 87,25,025 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య శాఖ వెల్లడించింది.

తూర్పుగోదావరిలో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం

తూర్పుగోదావరిలో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం

ఏపీలో జిల్లాలవారీగా కొత్త కరోనా పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 84, చిత్తూరులో 105, తూర్పుగోదావరిలో 341, గుంటూరులో 116, కడపలో 100, కృష్ణాలో 75, కర్నూలులో 36, నెల్లూరులో 76, ప్రకాశంలో 66, శ్రీకాకుళంలో 47, విశాఖపట్నంలో 42, విజయనగరంలో 61, పశ్చిమగోదావరిలో 243 కేసులు నమోదయ్యాయి.

దేశంలోనూ తగ్గుతున్న కరోనా..

దేశంలోనూ తగ్గుతున్న కరోనా..

ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,903 కరోనా కేసులు నమోదు కాగా, 490 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి చేరింది. మరణాల సంఖ్య 1,26,611కు చేరింది. దేశంలో ప్రస్తుతం 5,09,673 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కోలుకున్నవారి శాతం 92.56 ఉండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+