ఏపీలో 1500గాటిన కరోనా కేసులు: 13వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కొత్త కేసులివే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండో రోజులుగా తగ్గినట్లే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 67,716 నమూనాలను పరీక్షించగా.. 1501 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1501 కరోనా కేసులు, 10 మంది మృతి
తాజాగా నమోదైన 1501 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,98,603కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖపట్నంలో ఒక్కరు మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురంలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,696 మృతి చెందారు.

ఏపీలో 13,696 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1697 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,69,169కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 13,696 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,03,366 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 315 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరం జిల్లాలో 06 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 21, చిత్తూరులో 174, తూర్పుగోదావరిలో 315, గుంటూరులో 141, కడపలో 49, కృష్ణాలో 147, కర్నూలులో 10, నెల్లూరులో 242, ప్రకాశంలో 107, శ్రీకాకుళంలో 30, విశాఖపట్నంలో 109, విజయనగరంలో 06, పశ్చిమగోదావరిలో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,83,454, చిత్తూరులో 2,35,784 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,945) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశ వ్యాప్తంగా తగ్గిన కొత్త కరోనా కేసులు
ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో భారత్ లో 36,401 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య గురువారం 32,322,258 కి పెరిగింది. గత 24 గంటల్లో 530 మంది కరోనా సోకిన రోగులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన మరణాల సంఖ్య 433,049 కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడిన వారు 39,157 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా దేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,15,25,080 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 369,129కి తగ్గాయి. కరోనా యాక్టివ్ కేసులు ఇంత తక్కువగా నమోదు కావడం149 రోజుల్లో ఇదే మొదటిసారి. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1.13 శాతం గా ఉంది. ఇక రికవరీ రేటు 97.52 శాతం గా నమోదయింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. 24 గంటల్లో 56,36,336 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 56.64 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయినట్లుగా సమాచారం. ఇక కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న వేగాన్ని సూచించే రీ ప్రొడక్షన్ రేట్ ప్రస్తుతం తక్కువగా ఉండటం దేశానికి కాస్త ఊరట కలిగిస్తుంది. మరోపక్క కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా ఉండబోదని నిపుణులుసూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అంత ప్రమాదకరంగా మారదని అంటున్నారు. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసు నమోదు ఎక్కువగా కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 21, 427 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కేసులు అక్కడే నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలోనే 59శాతం కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. కేరళ తర్వాత మహారాష్ట్రలో 5,132 కరోనా కేసులు నమోదు కాగా ఆ తర్వాతి స్థానంలో తమిళనాడులో 1,797 కేసులు ఆంధ్రప్రదేశ్లో 1,433 కేసులు కర్ణాటక రాష్ట్రంలో 1,365 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లో 646 కరోనా కేసులు, ఒడిశాలో 993 కరోనా కేసులు, మిజోరంలో 600 కేసులు నమోదయ్యాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలను తప్పకుండా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications