వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: కొత్త మరణాలు లేవు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 4813కు చేరింది.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా: ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు నమోదు, 10 మరణాలుతెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా: ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు నమోదు, 10 మరణాలు

2720 మంది కోలుకున్నారు..

2720 మంది కోలుకున్నారు..

తాజాగా నమోదైన కేసుల్లో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు 28 ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ఒక్క కేసు ఉంది. తాజాగా 34 మంది కరోనా నుంచి కోలుగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2720కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2018 ఉన్నాయి.

కోయంబేడు లింకులతోనే కేసులు

కోయంబేడు లింకులతోనే కేసులు

కర్నూలు జిల్లాలో 772 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరులో 558, కృష్ణాలో 551, నెల్లూరులో 335, కేసులు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల ఎవరూ చనిపోలేదు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Delhi CM Arvind Kejriwal Unwell, To Undergo Covid-19 Test
ఇతర రాష్ట్రాలు, విదేశాల కేసులు

ఇతర రాష్ట్రాలు, విదేశాల కేసులు


రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కుమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 838 కాగా, వీటిలో యాక్టివ్ కేసులు 520 ఉన్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చిన 132 మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 2,57,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,25,959 యాక్టివ్ కేసులున్నాయి. 1,23,912 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 7,208 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, సోమవారం నుంచి ఏపీలో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లతోపాటు ప్రార్థనా మందిరాలు తెరచుకున్నాయి. అయితే, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి కార్యకలాపాలు సాగించాలని స్పష్టం చేసింది.

English summary
154 new corona cases recorded in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X