బోటు ప్రమాదంలో మృతుల వివరాలు, మిస్సయిన వారి పేర్లు

Subscribe to Oneindia Telugu

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. ఇందులో 10 మంది పురుషులు, 6 గురు మహిళలు ఉన్నారు. దాదాపు అందరూ 40 సంవత్సరాలు పై బడిన వారు ఉన్నారు. మృత దేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా, మరికొన్ని మృత దేహాలను కృష్ణా జిల్లా నిమ్రా కి తరలించారు.

  Krishna River Boat Incident : Ex-Gratia Announced Video | Oneindia Telugu

  చదవండి: ఏపీ టూరిజం బోట్ లేదు, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వలేదు: బోటు ప్రమాదానికి కారణాలివీ!

  మృతుల పేర్లు

  (1) రాయపాటి. సుబ్రహ్మణ్యం (60) సంవత్సరాలు.
  (2)పసుపులేటి. సీతారామయ్య (64).
  (3)కె. ఆంజనేయులు (58)
  (4)కొపూరి లలిత (35)
  (5)వెంకటేశ్వరరావు (48)
  (6) రాజేష్ (49)
  (7) హేమలత (48)
  (8) దాచర్ల భారతి (60)
  (9) ఏ. కోటిరెడ్డి(45)
  (10) ప్రభాకర రెడ్డి(50)
  (11) అంజమ్మ (55)
  (12) వెన్నెల సుజాత (40)
  (13) అరవపల్లి గుర్నాథ రావు
  (14)కోపూరి. కోటేశ్వరరావు(40).
  (15)సాయిన కోటేశ్వరరావు.
  (16) సాయిన వెంకాయమ్మ.

  16 killed after boat capsizes in Vijayawada, details of victims

  ఇందులో ఆరు మృత దేహాలను కృష్ణా జిల్లా నిమ్రా ఆసుపత్రికి, పదిమంది మృత దేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆంధ్రా ఆసుపత్రిలో నలుగురు, నిమ్రా ఆసుపత్రి లో నలుగురు చికిత్స పొందుతుండగా, ఒకరిద్దరు కోమాలో ఉన్నారు. మరో ప్రక్క ప్రస్తుతం గాలింపు చర్యలు ముగిసే సమయానికి కొందరి ఆచూకీ లభ్యం కాలేదు.

  కృష్ణా నదిలో పడవ బోల్తా: 16 మంది మృతి, బోటులో 38 మంది

  గల్లంతైన వారి వివరాలు

  (1)వెన్నెల రమణమ్మ,
  (2)కారుదారు ఉషారాణి.
  (3)గాజర్ల శివన్నారాయన.
  (4) పోలా కోటేశ్వరరావు.
  (5)పోలా వెంకాయమ్మ.
  (6) బిందు శ్రీ.
  (7) కూరపాటి నారాయణ రాజు.

  మొత్తం 38 మంది కాగా ఇందులో 16 మంది మృతి. 15 మంది చికిత్స పొందుతుండగా, 7 గురు మిస్సయ్యారు. మిస్సయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A tourist boat on the Krishna river capsized around 5 pm on Sunday in Vijayawada, killing 16 people.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి