ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు... మరో 64 మంది మృతి...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 17,354 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 64 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 11,01,690కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7992కి చేరింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 86,494 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,63,90,360 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 8468 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 9,70,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,22,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2764 కొత్త కేసులు,అనంతపురంలో 1882 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 661 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో నెల్లూరు,విశాఖపట్నంలలో 8 మంది చొప్పున,విజయనగరంలో ఏడుగురు,చిత్తూరు,తూర్పు గోదావరి,ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున,అనంతపురంలో ఐదుగురు,గుంటూరు,కర్నూలు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు,ఇతరత్రా వేడుకలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. క్రీడా ప్రాంగణాలు,జిమ్ సెంటర్లు,స్విమ్మింగ్ పూల్స్‌ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. అలాగే ప్రజా రవాణా,సినిమా హాళ్లు 50శాతం ఆక్యపెన్సీతోనే నిర్వహించాలని ఆదేశించింది.
ఇక పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని జగన్ చెప్పారు. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని గుర్తుచేశారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని, నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసిందని, దీంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications