ఏపీలో కొత్తగా 174 కరోనా కేసులు: చిత్తూరు జిల్లాలో విజృంభణ, పెరుగుతున్న యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 47,803 నమూనాలను పరీక్షించగా.. 174 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,91,178కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల..
గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7179 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 78 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,842కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 1158 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,44,03,941 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 6, చిత్తూరులో 60, తూర్పుగోదావరిలో 11, గుంటూరులో 12, కడపలో 5, కృష్ణాలో 26, కర్నూలులో 8, నెల్లూరులో 3, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 23,
విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. గత 24 గంటల్లో 7,78,416 మందికి నమూనా పరీక్షలను నిర్వహించగా.. 22,854 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,12,85,561కు చేరింది. అయితే, గత ఒక్కరోజు వ్యవధిలో 18,100 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 96.92 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 126 మంది మరణించారు. ఇప్పటి వరకు 1,58,189 మంది ఈ మహమ్మారితో మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,89,226 యాక్టివ్ కేసులున్నాయి.
ఒక్క మహారాష్ట్రలోనే దేశంలో సగానికిపైగా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications