సీనియర్లకు కీలక శాఖల బాధ్యతలు - చంద్రబాబు ఏరికోరి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార ప్రక్షాళన కొనసాగిస్తున్నారు. కీలక శాఖల బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ లకు అప్పగిస్తున్నారు. మరో విడత ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసారు. 19 మంది అధికారుల బదిలీ, పోస్టింగ్స్ పైన ఉత్తర్వులు జారీ చేసారు. పాలనలో కీలకమైన శాఖలకు చంద్రబాబు ఏరి కోరి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్ అధికారుల బదిలీల పైన కసరత్తు జరుగుతోంది.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి నియమితులయ్యారు. అటవీ శాఖ స్పెషల్ సిఎస్ గా అనంతరాము, రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా కాంతిలాల్ దండే, ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ సిఎస్ గా ఆర్పి సిసోడియా, పెట్టుబడిలు, మౌలిక వసతుల కార్యదర్శిగా సురేష్ కుమార్ బాధ్యతలు నిర్వహించనున్నారు. సురేష్ కుమార్ కు అదనంగా గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఐటీ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ అదనపు బాధ్యతలు ఖరారు చేశారు.

యువరాజుకు పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలను అప్పగించారు. మైనార్టీ సంక్షేమ కార్యదర్శిగా హర్షవర్ధన్ నియమించారు. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న కన్నబాబుకు గిరిజన సంక్షేమ కార్యదర్శిగా బాధ్యతలు కేటాయించారు. వివేక్ యాదవ్ కు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ కేటాయించారు. మహిళ స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శిగా సూర్య కుమారి కి పోస్టింగ్ ఇచ్చారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా శ్రీధర్, ఆర్థిక శాఖ ఆదనపు కార్యదర్శిగా జయ నివాస్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా విజయరామరాజు, సమాచార శాఖ డైరెక్టర్ గా హిమాన్షు శుక్ల, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా ఎస్ ఢిల్లీ రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది












Click it and Unblock the Notifications