ఏపీలో భారీ తగ్గిన కరోనా కేసులు, మరణాలు: 13వేలు దాటిన మరణాలు, 28వేలకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 3వేలకు దిగువనే కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా తక్కువే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 91,677 నమూనాలను పరీక్షించగా.. 2665 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2665 కరోనా కేసులు, 16 మంది మృతి

ఏపీలో కొత్తగా 2665 కరోనా కేసులు, 16 మంది మృతి

తాజాగా నమోదైన 2665 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,22,843కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 16 మంది మృతి చెందారు.

తూర్పుగోదారి జిల్లాలో అత్యధికంగా నలుగురు మరణించగా, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళంలో ఇద్దరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,002 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 28వేలకు యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 28వేలకు యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3,231 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,81,161కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 28,680 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,29,86,288 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 529 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 33 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 106, చిత్తూరులో 353, తూర్పుగోదావరిలో 529, గుంటూరులో 223, కడపలో 161, కృష్ణాలో 281, కర్నూలులో 33, నెల్లూరులో 195, ప్రకాశంలో 285, శ్రీకాకుళంలో 56, విశాఖపట్నంలో 112, విజయనగరంలో 38, పశ్చిమగోదావరిలో 293 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,69,977, చిత్తూరులో 2,24,585 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(80,823) కరోనా కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+