తాడిపత్రిలో మళ్లీ పురివిప్పిన పాతకక్షలు:నలుగురిపై కత్తులు,రాళ్లతో దాడి...ఇద్దరు మృతి

అనంతపురం:అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువులో నలుగురు వ్యక్తులపై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

తాడిపత్రిలోని పెన్నా సిమెంట్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద ఈ భీకర దాడి చోటుచేసుకుంది. మద్యం దుకాణం వద్ద నిలబడి మాట్లాడుకుంటున్న వెంకట రమణ, తలారి రంగయ్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై హఠాత్తుగా కొందరు దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

2 Dead, 1 Injured In TadipatrFaction murders

వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రంగయ్య మృతిచెందాడు. క్షతగాత్రుల్లో అనంతపురం ఆసుపత్రిలో ఒకరు, తాడిపత్రి ఆసుపత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. పాతకక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తలారి చెరువు గ్రామంలో ఉరుసు జరుగుతుండటంతో తాడిపత్రి నుంచి వెళ్లిన పోలీసులు ఊరుచింతల, తలారి చెరువు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పర్యవేక్షణ చేస్తున్నారు.

ఈ ఘటనలో పది మందిపైగా దాడికి పాల్పడినట్లు తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. నిందితులను పట్టుకోడానికి పోలీసులు గ్రామంలో విస్తృతంగా తనిఖీలు, సోదాలు జరుపుతున్నారు. ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన వెంకటరమణ ఫీల్డ్ అసిస్టెంట్ అని తెలిసింది.

మరోవైపు కడపకు చెందిన మాధవరెడ్డి అనే యువకుడు తిరుపతిలో హత్యకు గురయ్యాడు. దుండగులు ఇతడి గొంతుకోసి, ముఖంపై కత్తితో పొడిచి చంపారు. తిరుపతి ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపిన ప్రకారం...కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన చిన్నఓబుల్‌రెడ్డికి నవీన్‌రెడ్డి, మాధవరెడ్డి(38) కుమారులు. శస్త్రచికిత్స కోసం మంగళవారం చిన్నఓబుల్‌రెడ్డిని ఆయన ఇద్దరు కుమారులు, చిన్న కోడలు (మాధవరెడ్డి భార్య) తిరుపతిలోని డీబీఆర్‌ వైద్యశాలలో చేర్పించారు.
ఆరోజు రాత్రి సుమారు ఏడున్నరకు మాధవరెడ్డి తన భార్య, తండ్రి, సోదరుడికి హోటల్‌నుంచి అన్నం పార్శిల్‌ తీసుకొచ్చి ఇచ్చాడు. తాను బయట తింటానని
చెప్పి 8 గంటల సమయంలో సెల్‌ఫోన్‌ను హాస్పటల్ లోనే ఛార్జింగ్‌పెట్టి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రికి రాలేదు. దీంతో అతడి గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అతడి ఆచూకి కోసం వెతుకుతున్నారు.

ఈక్రమంలో భారతి బస్టాండు సమీపంలో కంపచెట్లమధ్య ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌ అనుమానంతో మాధవరెడ్డి కుటుంబీకులను పిలిపించారు. ఆ మృతదేహం మాధవరెడ్డిదేనని సోదరుడు నవీన్‌రెడ్డి తెలిపాడు. తమ ఊరిలో పాతకక్షలు ఉన్నాయని వారే ఈ పని చేసిఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+