ఎమ్మెల్యేనంటూ తిరుమలలో మోసం: వ్యక్తితోపాటు దళారి అరెస్టు
అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రంలో రోజురోజుకీ దళారుల పెరిగిపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యేనంటూ ఓ వ్యక్తి తనకు తెలిసిన దళారీతో కలిసి తిరుమలలో మోసానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే సిఫారసు లేఖను వాడుకుని శ్రీవారి అర్చన, వీఐపీ బ్రేకు(ఎల్-1) టికెట్లను పొందినట్లు విచారణలో తేలడంతో పోలీసులు శుక్రవారం వారిద్దరినీ అరెస్టు చేశారు.
తిరుమల వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కృష్ణయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీవారి దర్శనార్ధమై తన సిఫారసు లేఖను తన అనుచరుడైన బి. వెంకటేశ్‌కు ఇవ్వడంతో అతడు తిరుమలకు వచ్చాడు.
తిరుమలకు వచ్చిన బి. వెంకటేస్ తనకు పరిచయస్తుడైన చిత్తూరు జిల్లా నగరికి చెందిన దళారీ డి. వెంకటేశ్‌కు తాను తిరుమలకు వస్తున్నట్టు చెప్పి, అతడిని కూడా అక్కడికి రమ్మన్నాడు. అనంతరం వారి వద్ద ఉన్న ఎమ్మెల్యే సిపారసు లేఖను కలర్ జిరాక్స్ తీశారు.
ఈ లేఖను ఉపయోగించి ఎమ్మెల్యే స్వయంగా వస్తున్నారని గురువారానికి మూడు అర్చన, ఎనిమిది వీఐపీ బ్రేకు (ఎల్-1) దర్శన టికెట్లకు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత నర్సారావుపేటకు చెందిన వెంకటేశ్ తానే ఎమ్మెల్యేనని చెప్పి జేఈఓ కార్యాలయంలో టికెట్లను తీసుకున్నాడు.

అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళ్లాడు. ఎమ్మెల్యే కోటాలో అనుభవించాల్సిన వసతులన్నీ అనుభవించారు. ఈ క్రమంలో తనిఖీల్లో వెంకటేశ్ ఇచ్చిన లేఖ నకిలీదని టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని సిబ్బంది విజిలెన్స్ వింగ్ విభాగానికి తెలియజేశారు.
ఈ సమయంలో వారిద్దరి కుటుంబ సభ్యులతో పాటు గుంటూరుకు చెందిన మరో ముగ్గురితో కలిసి అర్చన, ఎల్-1 దర్శనాలను పూర్తి చేసుకున్నారు. దర్శన అనంతరం విజిలెన్స్ విభాగం ఇద్దరు వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా, మోసాన్ని అంగీకరించారు.
దీంతో వెంటనే వారిద్దరిని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా వీరిద్దరూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది.












Click it and Unblock the Notifications