ఏపీలో 20వేలకుపైనే కరోనా కొత్త కేసులు, 100కుపైగా మరణాలు, జిల్లాలవారీగా కొత్త కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేగాక, కరోనా మహమ్మారి బారినపడి వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 92,231 నమూనాలను పరీక్షించగా.. 20,937 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు, 104 మరణాలు

ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు, 104 మరణాలు


తాజాగా నమోదైన 20,937 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,42,079కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 104 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కృష్ణా జిల్లాల్లో 8 మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 9904కు చేరింది.

ఏపీలో 2 లక్షలకుపైనే యాక్టివ్ కేసులు

ఏపీలో 2 లక్షలకుపైనే యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 20,811 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 13,20,124కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,84,35,149 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3475 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 721 మంది కరోనా బారినపడ్డారు.

Recommended Video

    CoviSelf | Mylab Self-Testing Covid Kit | Covid-19 Test At Home | Oneindia Telugu
    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1818, చిత్తూరులో 3063, తూర్పుగోదావరిలో 3475, గుంటూరులో 1463, కడపలో 721, కృష్ణాలో 1292, కర్నూలులో 970, నెల్లూరులో 1246, ప్రకాశంలో 1296, శ్రీకాకుళంలో 1143, విశాఖపట్నంలో 1886, విజయనగరంలో 930, పశ్చిమగోదావరిలో 1634 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు. తాజాగా, బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+