అమెరికాలో తెలుగు విద్యార్థులకు షాక్, కల తారుమారు: ఫేస్‌బుక్‌తో ఇరికిపోయారు
హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఇరవై మంది తెలుగు విద్యార్థులను ఆదివారం చికాగో విమానాశ్రయం నుంచి అధికారులు వెనక్కి పంపించారు. దీనికి విద్యార్థులు ఫేస్‌బుక్‌లో పంచుకున్న సమాచారం కూడా కారణమని చెబుతున్నారు.
ఫేస్‌బుక్ తెలుగు విద్యార్థుల అమెరికా కలలను తారుమారు చేసింది. ఫేస్‌బుక్‌లో స్నేహితులకు పంపిన సమాచారం చివరి నిమిషంలో వారిని స్వదేశానికి తిప్పి పంపేలా చేసింది. విద్యార్థుల్ని అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపడానికి ఫేస్‌బుక్ దోహదపడిందంటున్నారు.
వందల మంది కేవలం రెండు విశ్వవిద్యాలయాల్లోనే ఎందుకు చేరుతున్నారు? అదే అనుమానంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుగు విద్యార్థుల ఫేస్‌బుక్ ఖాతాలను తనిఖీ చేశారు.

అందులో అమెరికాలో చదువుకోవడానికి అవసరమైన డబ్బును బ్యాంకు ఖాతాలో ఉండేలా ఎలా చక్కబెట్టింది, స్థిరాస్తులు ఉన్నట్లుగా ఎలా చూపింది.. తదితర సమాచారాన్ని స్నేహితులతో పంచుకున్నారు. వాటిని చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వెనక్కి పంపించారు.
ఫేస్‌బుక్‌లోని సమాచారంతో విద్యార్థుల స్థాయిని, మనస్తత్వాన్ని కూడా అంచనా వేసినట్లు చెబుతున్నారు. కాగా, గతంలో మూడు నాలుగు ప్రశ్నలు వేసి పంపించేవారని, ఇప్పుడు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని కూడా చెబుతున్నారు.
-
యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో 'డెడ్లీ' ఆపరేషన్ -
ఆ పైలట్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ లోనే సురక్షితం" -
ఇరాన్ అతిపెద్ద అణు కేంద్రం నుంచి భారీ లీక్- ఐరాసకు లేఖ -
పేపర్ కప్పులో టీ, కాఫీ తాగుతున్నారా? అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications