చంద్రబాబు వెళ్లే మార్గంలో 200 జిలెటిన్ స్టిక్స్, నిర్ఘాంతపోయిన అధికారులు
బుక్కపట్నం - కొత్తచెరువు మార్గంలో కాలం చెల్లిన 200 జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించారు. చంద్రబాబు వెళ్లే దారిలో.. ఆయన వెళ్లడానికి కాసేపటికి ముందు జిలెటిన్ స్టిక్స్ దొరకడంపై భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కపట్నంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణించే మార్గంలో బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.
కడపలో జగన్‌కు చెప్పే దిశలో చంద్రబాబు అడుగులు
బుక్కపట్నం - కొత్తచెరువు మార్గంలో కాలం చెల్లిన 200 జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించారు. చంద్రబాబు వెళ్లే దారిలో.. ఆయన వెళ్లడానికి కాసేపటికి ముందు జిలెటిన్ స్టిక్స్ దొరకడంపై భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసింది.

హంద్రీనీవా కాలువ తవ్వకంలో పేలుళ్లకు ఉపయోగించే నిమిత్తం వీటిని తీసుకు వచ్చారని, మిగిలిపోయిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. ఘటనతో అప్రమత్తమైన యంత్రాంగం కాసేపట్లో అదే మార్గంలో సీఎం పయనించడంతో ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు మధ్యాహ్నం బుక్కపట్నం చెరువును పరిశీలించారు. అంతకుముందు కొత్త చెరువులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications