ఏపీ కరోనా అప్‌డేట్‌- 24 గంటల్లో2477 కేసులు- కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోనే అత్యధికం..

ఏపీలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2477 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా వివిధ జిల్లాల్లో కలిపి పది మంది మరణించారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిలాల్లో ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 424 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లో పశ్చిమగోదావరి 375, కృష్ణా 332, గుంటూరు 323, చిత్తూరు 321 కేసులు నమోదయ్యాయి. అత్యల్ప కేసులు నమోదైన జిల్లాల జాబితాలో 35 కేసులతో కర్నూలు టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత స్దానాల్లో అనంతపురం 52, ప్రకాశం 70, విజయనగరం 85, నెల్లూరు 94, శ్రీకాకుళం 117, కడప 127 కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8.33 లక్షలకు చేరింది. ఇందులో 8.05 లక్షల మంది ఇప్పటికే డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 21438 మంది చికిత్స పొందుతున్నారు.

2477 new covid 19 cases in last 24 hours in ap, godavari districts on top

మృతుల విషయానికొస్తే కరోనా కారణంగా గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, అనంతపూర్‌లో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6744కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో మరోసారి అత్యధికంగా 75465 పరీక్షలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+