కడప జిల్లాలో ఘోర ప్రమాదం: లోయలో పడ్డ పెళ్లి బస్సు
అమరావతి: కడప జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో బయలుదేరిన ఓ బస్సు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే పెద్దమొడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి పెళ్లికూతురు తరుపు బంధువులు సుమారు 60 మంది బస్సులో పులివెందులకు బయల్దేరారు. ముద్దనూరు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.
ఈ క్రమంలో అయితే అటుగా వెళుతున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా పెళ్లి కుమార్తెతో ఉన్న బస్సు గంట ముందే బయల్దేరి వెళ్లడం విశేషం.
ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ: బీటెక్ విద్యార్థి మృతి
ప్రకాశం జిల్లా కందుకూరు-సింగరాయకొండ రహదారిలో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు మృతిచెందాడు. మృతుడు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తుళ్లూరు ప్రవీణ్‌గా గుర్తించారు.












Click it and Unblock the Notifications