ఇండియన్ రైల్వే దీపావళికి బొనాంజా
పండగల సీజన్ కావడంతో భారతీయ రైల్వేలో రద్దీ పెరిగింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ 283 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఛత్, దీపావళిని దృష్టిలో ఉంచుకొని ఇవి 4480 ట్రిప్పులు వేయనున్నట్లు తెలిపారు. జోన్లవారీగా ఎన్ని రైళ్లున్నాయో తెలుసుకుందాం.
తూర్పు మధ్య రైల్వే మొత్తం 42 ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. పశ్చిమ రైల్వే 36 ప్రత్యేక రైళ్లను, నార్త్ వెస్ట్రన్ రైల్వే 24 ప్రత్యేక రైళ్ల ద్వారా మొత్తం 1,208 ట్రిప్స్ నడపనుంది. ఈస్ట్రన్ కోస్ట్ రైల్వే జోన్ (ECOR): 12, ఈస్ట్రన్ రైల్వే (ER): 8, నార్తర్న్ రైల్వే (NR): 34, ఈశాన్య రైల్వే (NER): 4, NFR: 22, నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR): 24, దక్షిణ రైల్వే (SR): 10, సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER): 8, దక్షిణ మధ్య రైల్వే (SCR): 58, సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR): 11, వెస్ట్రన్ రైల్వే (WR): 36 రైళ్లు నడుస్తాయి.

దీపావళి-ఛత్ సమయంలో, యూపీ-బీహార్ వైపు వెళ్లే రైళ్లు ఎక్కువ రద్దీగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఏటా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అంతేకాకుండా యూపీ, బీహార్, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ఛార్జీలతో కేవలం స్లీపర్, జనరల్ బోగీలతో జనతా రైళ్లను నడిపించాలనే యోచనలో రైల్వే శాఖ ఉంది. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు.












Click it and Unblock the Notifications