చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ: ఏపీలో పెరిగిన కేసులు, 1400కు చేరిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 45.664 నమూనాలను పరీక్షించగా.. 298 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,91,861కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల..
గత 24 గంటల్లో కరోనా బారినపడి నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7184 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 164 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,83,277కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1400 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,34,762 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 9, చిత్తూరులో 90, తూర్పుగోదావరిలో 32, గుంటూరులో 48, కడపలో 12, కృష్ణాలో 32, కర్నూలులో 14, నెల్లూరులో 3, ప్రకాశంలో 11, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 32,విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
మరోవైపు భారతదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే సగానికిపైగా కరోనా కొత్త కేసులు ఉండటం గమనార్హం. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 8,64,368 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 25,320 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 161 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,58,607కి చేరింది. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 16,637 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,09,89,897కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,544కి పెరిగింది. కాగా, ఒక్క మహారాష్ట్రంలోనే ఒక్కరోజు వ్యవధిలో 15,602 కరోనా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. 88 మంది కరోనాతో మరణించారు. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే దేశంలో సగానికిపైగా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications