గోదారికి వరద పోటు: ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక-లక్షల క్యూసెక్యులు సముద్రంపాలు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది.
బుధవారం రాత్రి 9:30 గంటల సమయానికి భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వరద ప్రవాహం దాదాపుగా 48 అడుగులకు చేరింది. దీనితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం.. వంటి మండలాల వెళ్లే రహదారులపై వరదనీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదే తరహా పరిస్థితి ఏపీలోనూ నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి గోదావరి పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో భారీగా ఉంటోంది. ఇన్ ఫ్లో పెరుగుతోండటంతో అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. ధవళేశ్వరం వద్ద అవుట్ ఫ్లో- 13.05 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.
దీనితో విపత్తు నిర్వహన విభాగం అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో- దీని ప్రభావం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాలపై పడింది. ఆయా మండలాల పరిధిలో ఉన్న 458 గ్రామాలు ముంపు భయాన్ని ఎదుర్కొంటోన్నాయి.
ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ విభాగం అధికారులు అప్రమత్తం అయ్యారు. అత్యవసర సహాయక చర్యలకోసం 3 ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నామని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
మరో వైపు ప్రకాశం బ్యారేజి వద్ద కూడా అవుట్ ఫ్లో కొనసాగుతోంది. 1.42 లక్షల క్యూసెక్కుల వరద జలాలను అధికారులు దిగువకు వదిలివేశారు. ఫలితంగా- కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 అందుబాటులోకి తెచ్చారు.
-
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications