విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహిస్తామని, దీన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఉత్సవ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జనవరి 1 నుంచి 3 వరకూ ఆర్కే‌బీచ్‌లో జరగనున్న విశాఖ ఉత్సవ్‌తో పాటు జనవరి 10 నుంచి 12వరకూ బీచ్‌రోడ్డులోని ఏపీఐఐసీ స్థలంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రి గంటా పరిశీలించారు. అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ జనవరి 1 నుంచి 3 వరకు విశాఖ ఉత్సవ్ పేరిట ఉత్సవాలు జరుగుతాయన్నారు.

తొలిరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి యనమలరామకృష్ణుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. 2న జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పాల్గోనే రోజున బీచ్‌రోడ్డులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలతో కార్నివాల్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

ఆర్కేబీచ్‌, వుడాపార్కు, జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ఎంజీఎం పార్కులో ఫల, పష్ప ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

ప్రముఖ సింగర్స్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో స్వరాభిషేకం, నాగూర్‌బాబు, ఉషా వూతప్‌ ఆధ్వర్యంలో మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

బీచ్‌రోడ్డులోని హోటళ్ల ఆధ్వర్యంలో ఫుడ్‌ఫెస్టివల్‌ ఏర్పాటు చేస్తున్నామని, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్ధాలు సరసమైన ధరలకు ఇక్కడ లభిస్తాయన్నారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

ఉత్తరాంధ్రా జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల నమూనా ఆలయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సంగీత కార్యక్రమాలను ప్రజలు అస్వాదించాలన్నారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

కాగా జనవరి 10 నుంచి 12వరకూ జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారని, రూ. లక్షకోట్ల పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న సదస్సుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌, భాగస్వామ్య సదస్సుకు చేస్తున్న ఏర్పాట్లు, ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలిగించేందుకు తీసుకుంటున్న చర్యలను సమావేశంలో వివరించారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

ఈ ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేసేందుకు నగర, జిల్లావాసులంతా పాల్గొనాలని కోరారు. 12 శాఖలకు చెందిన శకటాలు కార్నివాల్‌లో పాల్గొంటాయని, 25వేల మంది ఉత్సవంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

విశాఖ ఉత్సవ్ 2016: ముమ్మరంగా ఏర్పాట్లు, స్టేజ్ ఇదే

ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్‌ యువరాజ్‌, జేసీ నివాస్‌, కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా వీసీ బాబూరావునాయుడు తదితర సీనియర్‌ అధికారులంతా సమీక్షలో పాల్గొన్నారు.

English summary
3-day Visakha utsav begins on Friday at Beach road says minister Ganta Srinivasa Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X