లోయలో పడ్డ వ్యాన్...ముగ్గురి మృతి....9 మందికి గాయాలు
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో శుక్రవారం వేకువఝామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుది. ఈ రోడ్డులో ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

తొమ్మిదిమంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిని చింతూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు.













Click it and Unblock the Notifications