అనంతలో బోల్తా పడిన బస్సు: 30 మందికి గాయాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల వల్ల ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణీకులతో ఆదివారం రాత్రి బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా పరిధిలో బోల్తాపడింది.
జిల్లాలోని గుత్తి మండలం కొత్తపేట వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది ప్రయాణీకులకు గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications