స్ధానికత, పదవీ విరమణ: ఏపీకి ఇష్టపడి 33 మంది

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 52 ఉమ్మడి విభాగాధిపతులు, సచివాలయ శాఖల్లోని ఉద్యోగుల విభజన ఒ కొలిక్కి వచ్చింది. వీటిలో 28 శాఖల్లోని ఉద్యోగులను రెండు రాష్ట్రాలనకు నియమిస్తున్నట్లుగా ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో ఉద్యోగుల్లో అత్యధికమంది వారు ఏ రాష్ట్రంలో స్ధానికతను కలిగి ఉంటే ఆ రాష్ట్రానికే నియమితులయ్యారు. మరికొంత మంది తెలంగాణ స్ధానికతను కలిగి ఉన్నా ఏపీలో పనిచేసేందుక ఆసక్తిని కనబర్చారు.

అందుకు వివిధ కారణాలున్నాయి. ఏపీలో పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు కావడంతో చాలా మంది ఆ రాష్ట్రంలో పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొంత మందికి ఏపీలో వారి అర్హతకు తగ్గ పోస్టులు లేనందున తెలంగాణలోనే పోస్టులు లభించాయి. ఏపీకి వెళ్లే పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు పదోన్నతి కూడా లభించవచ్చని అంచనాలు వేసుకొన్న కొంత మంది అధికారులు ఆ రాష్ట్రంలో పని చేసేందుకు ఆసక్తి కనబర్చారు.

33 employees ready to shift vijayawada

ఇది ఇలా ఉంటే, ఒక అధికారి భార్య తెలంగాణలో పనిచేస్తున్నప్పటికీ పదోన్నతి లభిస్తుందనే కారణంతో ఏపీలోనే ఉండిపోగా ఇప్పుడు తెలంగాణ అధికారి అక్కడికి వెళ్లడంతో ఆయనకు పదోన్నతికి లభించదు. మరికొంత మంది భార్య/భర్త తెలంగాణలో పని చేస్తుండటం, ఆరోగ్య కారణాలు లాంటివి దృష్టిలో పెట్టుకుని ఏపీ స్ధానికత గల 64 మంది అధికారులు తెలంగాణలోనే పని చేస్తున్నారు.

ఇక, ఆర్ధిక శాఖలో విభజనపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటి వరకు ఆ శాఖలో ఎలాంటి విభజన జరగలేదు. తెలంగాణ స్ధానికత కలిగిన చివరి గ్రేడ్ అటెండర్లు, స్వీపర్లు తెలంగాణలోనే ఉంటామన్నా, వారిని ఏపీకే కేటాయించారు. ఔషధ నియంత్రణ విభాగంలో మొత్తం 15 మంది అటెండర్లూ తెలంగాణే వారు అయినప్పటికీ, వారిలో 9 మంది ఏపీలో పని చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+