ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, ఒకరు మృతి, కోయంబేడ్ మార్కెట్‌తో 6 కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,638 నమూనాలు పరీక్షించగా 33 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు శుక్రవారం మీడియా విడుదల చేసిన బులిటెన్లో వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజాగా నమోదైన 33 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2874కు చేరింది. మరో 79 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 777కు చేరింది.

కాగా, రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650కిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 400కుపైగా కేసులు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2037 మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.
కరోనా బారినపడి మొత్తం 60 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఒకరు మృతి చెందారు. కాగా, తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ వల్ల శుక్రవారం మరో ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరికి కోయంబేడు మార్కెట్ కారణంగా కరోనా సోకినట్లు తెలిపింది. అలాగే విదేశాల నుంచి వచ్చినవారిలో కూడా కొన్ని కేసులున్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 1,67,442 కరోనా కేసులు నమోదయ్యాయి. 4797 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications