ఏపీలో భారీగా తగ్గిన మరణాలు: 5 వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాల్లో తగ్గుతున్న కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 38,896 నమూనాలను పరీక్షించగా.. 381 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 381 కరోనా కేసులు, ఒకరు మృతి
కొత్తగా నమోదైన 381 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,65,235కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,365కి పెరిగింది.

ఏపీలో 4743కు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 414 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,46,127కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 4,743 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,94,04,281 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 82 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 04, చిత్తూరులో 82, తూర్పుగోదావరిలో 57, గుంటూరులో 29, కడపలో 09, కృష్ణాలో 61, కర్నూలులో 03, నెల్లూరులో 23, ప్రకాశంలో 23, శ్రీకాకుళంలో 17, విశాఖపట్నంలో 43, విజయనగరంలో 09, పశ్చిమగోదావరిలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,544, చిత్తూరులో 2,46,728 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,939) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశంలో పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 12.90,900 నమూనాలను పరీక్షించగా.. 16,156 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లకు పెరిగింది. బుధవారం 733 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మరణాల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 622 ఉండటం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,56,386కు పెరిగింది. గత 24 గంటల్లో 17,095 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.36 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.20 శాతానికి పెరగ్గా, పాజిటివిటీ రేటు 0.47 శాతానికి తగ్గింది. బుధవారం 49,09,254 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ శారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య 104 కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications