హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేకుల షెడ్డులో కోచింగ్: వడదెబ్బతో మూడో తరగతి అమ్మాయి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం కొడిగినహళ్లిలోని ఓ కోచింగ్ సెంటర్‌లో వడదెబ్బతో ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మూడో తరగతి విద్యార్థిని నిఖిత చికిత్స పొందుతూ మృతి చెందింది.

దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఓ స్కూల్లో ప్రవేశం కోసం విద్యార్థులకు కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటన పైన ఇంఛార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం విచారణకు ఆదేశించారు.

3rd Class girl dies of sunstroke

ఆ కోచింగ్ సెంటర్ రేకుల షెడ్డులో ఉంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రేకుల షెడ్డులో విద్యార్థులందర్నీ ఉంచడంతో అస్వస్థతకు గురయ్యారు. అసలే ఎండ, పైగా రేకుల షెడ్డు కావడంతో ఘోరం జరిగింది. విద్యార్థులు డిహైడ్రేషన్‌కు గురయ్యారు. నిర్వహకుల పైన కేసు పెట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 2, 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఏపీలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల నగరాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌లో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

English summary
3rd Class girl dies of sunstroke in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X