AP Elections: ఈసారి 4.14 కోట్ల ఓటర్లు-హోం ఓటింగ్ మొదలు-కీలక వివరాలివే..!
ఏపీలో మరో 10 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ వెల్లడించారు. ఇందులో మొత్తం ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, వాటిలో ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, నామినేషన్లు ఇలా అన్ని వివరాలను ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యను 4.14 కోట్లుగా తేల్చారు. ఇందులో 2 కోట్ల మంది పురుష ఓటర్లు, మరో 2 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటన తర్వాత 5.94 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు.
రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరూ 864 కేసులు నమోదు చేశారు. అలాగే 72,416 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఇప్పటివరకూ 203 కోట్ల విలువైన నగదు,మద్యం,అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఈవో తెలిపారు. 14 నియోజకవర్గాల్లో 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్,ఎక్కువ మంది కేంద్ర బలగాలతో పోలింగ్ ఉంటుందన్నారు.

ఎండలు ఎక్కువగా ఉండటంతో మెడికల్ కిట్స్,ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇవాళ మొదలైన హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 8 లోగా పూర్తి చేస్తామన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నచోట బ్యాలెట్ యూనిట్లు ఎక్కువగా పెట్టాల్సి వస్తుందన్నారు. జనసేన గ్లాస్ గుర్తు పై కోర్టు తీర్పు తర్వాత 15స్థానాల్లో అభ్యర్థులకు గుర్తు మార్పు చేశామని ఆయన తెలిపారు.
జనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించడం లేదన్నారు. అలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వలేదన్నారు. ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తు ను మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చామన్నారు.
ఈసారి పెరిగిన అభ్యర్థుల కారణం గా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయని సీఈవో తెలిపారు. వీటిని తెప్పించి జిల్లాకు పంపించామన్నారు. రాష్ట్రంలో 374 మంది ఎమ్మెల్యే అభ్యర్దులు, 64 మంది ఎంపీ అభ్యర్దులు భద్రత కావాలని అడిగాని, వీటిని డీజీపీకి పంపామన్నారు.












Click it and Unblock the Notifications