ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, తగ్గిన మరణాలు: ఆ ఒక్క జిల్లాలోనే మరణాల్లేవ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా 5వేలకు దిగవనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 95,327 నమూనాలను పరీక్షించగా.. 4250 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 4147 కరోనా కేసులు, 38 మరణాలు

ఏపీలో కొత్తగా 4147 కరోనా కేసులు, 38 మరణాలు

తాజాగా నమోదైన 4250 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,79,872కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 33 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 12,599 మృతి చెందారు. కాగా, శనివారం విశాఖపట్నం జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించలేదు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 46వేలకు యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 46వేలకు యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 5,570 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,22,500కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 44,773 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,17,32,933 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 890 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 102 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 188, చిత్తూరులో 673, తూర్పుగోదావరిలో 890, గుంటూరులో 309, కడపలో 179, కృష్ణాలో 399, కర్నూలులో 121, నెల్లూరులో 193, ప్రకాశంలో 461, శ్రీకాకుళంలో 131, విశాఖపట్నంలో 187, విజయనగరంలో 102, పశ్చిమగోదావరిలో 417 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,61,518, చిత్తూరులో 2,18,488 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+