వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం: ఏపీకి చేరుకున్న 4.44 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 4.44 లక్షల కరోనా టీకా డోసులు వచ్చాయ. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఈ తర్వాత రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను తరలించారు.
Recommended Video
అనంతరం అక్కడ్నుంచి వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలివెళ్లనున్నాయి. తాజాగా చేరుకున్న కరోనా టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది. ఈ క్రమంలో కరోనా రెండో డోసు తోపాటు తొలి డోసు కూడా వేసే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం కరోనా వార్సియర్స్, 45ఏళ్లకు పైబడినవారికే వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, గత కొద్ది రోజులుగా ఏపీలో 20వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఒక్కరోజులో వైరస్ సోకిన 118 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది.

రోజువారీ కేసులను పరిశీలిస్తే.. 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వచ్చాయి. ఇతర జిల్లాల్లో పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. వీరిలో 13,41,355 మంది కరోనా నుంచి కోలుకుని కోలుకున్నారు. కరోనా మరణాలు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఇలా ఉండగా.. బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ కేసులు వస్తున్నాయి. వీటిని నిర్ధారించి.. చికిత్స అందిస్తున్నారు. త్వరగా గుర్తిస్తే మేలు అని.. లేదంటే ఇబ్బందులు తప్పవని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications