ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు: 47వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా కొత్త కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా 5వేలకు దిగవనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 91,849 నమూనాలను పరీక్షించగా.. 4458 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

Recommended Video

    Covishield, Covaxin Effective Against Delta Plus variant - Says Health Secretary | Oneindia Telugu
    ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు, 38 మరణాలు

    ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు, 38 మరణాలు

    తాజాగా నమోదైన 4458 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,71,475కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 38 మంది మృతి చెందారు.

    చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది, కృష్ణాలో ఎనిమిది మంది, గుంటూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 12,528 మృతి చెందారు.

    ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 47వేలకు యాక్టివ్ కేసులు

    ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 47వేలకు యాక్టివ్ కేసులు

    ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 6,313 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,11,157కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 47,790 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,15,41,485 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 909 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 64 మంది కరోనా బారినపడ్డారు.

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 224, చిత్తూరులో 708, తూర్పుగోదావరిలో 909, గుంటూరులో 239, కడపలో 370, కృష్ణాలో 331, కర్నూలులో 126, నెల్లూరులో 212, ప్రకాశంలో 335, శ్రీకాకుళంలో 151, విశాఖపట్నంలో 198, విజయనగరంలో 64, పశ్చిమగోదావరిలో 591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,59,452, చిత్తూరులో 2,17,246 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+