చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర రోడ్డుప్రమాదం: నలుగురు స్పెయిన్ దేశస్తులతోపాటు మరొకరి మృతి

జిల్లాలోని పుంగనూరు మండలం యాతాల వంక సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి పుదుచ్చేరి వెళ్తున్న మినీ బస్సు రహదారిపై ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జిల్లాలోని పుంగనూరు మండలం యాతాల వంక సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి పుదుచ్చేరి వెళ్తున్న మినీ బస్సు రహదారిపై ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు స్పెయిన్‌ దేశస్థులు, డ్రైవర్‌ మృతి చెందారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొందరు స్పెయిన్‌ దేశస్థులు తమ సొంత డబ్బుతో రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతుతున్నారు. వీరు అనంతపురంలో ఏర్పాటు చేసిన ఆర్డీటీ సెంటర్‌ను సందర్శించిన అనంతరం పాండిచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మినీ బస్సు నుజ్జునుజ్జయింది.

4 spain citizens and driver killed in a road accident

బస్సులో ప్రయాణిస్తున్న 9మంది స్పెయిన్‌ దేశస్థుల్లో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు.. స్పెయిన్ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి మృతుల వివరాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

English summary
4 spain citizens and driver killed in a road accident, which is occurred in Chittoor district on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X