టిలో 40వేలమంది ఆంధ్ర ఉద్యోగులు: శ్రీనివాస్,గౌడ్

తెలంగాణ జిల్లాల్లో పని చేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల వివరాలను సేకరించడానికి టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేయగా, 40,378 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం అందిందని తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి ప్రతి విభాగంలో ఉన్న వివరాలు సేకరించినట్టు చెప్పారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా పాటించాలని కోరారు. ఉద్యోగుల విభజనలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఏపి అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కోసం నమస్తే తెలంగాణ విలేకరులకు పాస్‌లు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలన్నింటికీ పాస్‌లు జారీ చేసిన ఏపి ప్రభుత్వం నమస్తే తెలంగాణకు మాత్రమే పాస్‌లు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications