ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: తెలంగాణతో పోటీ పడుతూ..!

అమరావతి: రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 26 కేసులు వెలుగు చూశాయి. దీనితో ఆ జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 158కి చేరింది. ఇప్పటిదాకా 17 మంది కరోనా బారిన పడి మరణించారు. 65 మంది పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Recommended Video

    Coronavirus : COVID-19 Cases Cross 647 Mark In AP, 44 New Cases Reported

    కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు-26, కృష్ణా-6, తూర్పు గోొదావరి-5 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మూడు చొప్పున విశాఖపట్నంలో ఒక కేసు నమోదైందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. మొత్తం కేసుల సంఖ్య 647 వరకు ఉండగా ఇందులో యాక్టివ్‌గా ఉన్నవి 565.

    44 new COVID19 positive cases reported in AP last 24 hours total number is 647

    జిల్లాలవారీగా అనంతపురం-29, చిత్తూరు-28, తూర్పు గోదావరి-24, గుంటూరు-129, కడప-37, కృష్ణా-75, కర్నూలు-158, నెల్లూరు-67, ప్రకాశం-44, విశాఖపట్నం-21, పశ్చిమ గోదావరి-35 కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కాగా- ఆయా జిల్లాల్లో మొత్తం 65 మంది కరోనా పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 17 మంది మరణించారు. దీనితో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 565కు చేరుకుంది.

    కడప, విశాఖపట్నంలల్లో అత్యధికంగా కరోనా పేషెంట్లు కోలుకున్నారు. కడప-19, విశాఖపట్నం-16, పశ్చిమ గోదావరి-8, తూర్పు గోదావరి-8, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో నలుగురు చొప్పున కోలుకున్నారు. అనంతపురంలో ఇద్దరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కృష్ణా-5, కర్నూలు-4, గుంటూరు-4, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+