ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా... కొత్తగా 458 కేసులు,ఒకరి మృతి...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే ఒక్క మరణం నమోదైంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7070కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4377యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (డిసెంబర్ 18) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా మరో 534 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,63,464కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 69,062 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,11,34,359కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 98,కృష్ణా జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,23,220 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 22,890 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 99.79లక్షలకు చేరింది. 24గంటల వ్యవధిలో కొత్త ఇన్ఫెక్షన్స్ 4.6శాతం తగ్గిపోయాయి. మరో 338 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,44,789కి చేరింది. మరో 31,087 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 95,20,827కి చేరింది. కరోనా కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications