జగన్ రెడ్డి గారూ 48 గంటలు అన్నారు.. నెలవుతోన్నా జమ కానీ నగదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రైతు సంక్షేమం, రైతు భరోసా అని ఎన్నికల ముందు కబుర్లు చెప్పిన వైసీపీ.. తర్వాత రైతుల గురించి మరచిపోయిందని విమర్శించారు. ఖరీఫ్ పంట విక్రయించి నెలవుతోన్నా.. ఇప్పటివరకు కొందరు రైతులకు నగదు చెల్లించలేదని మండిపడింది. ప్రభుత్వం ఇంకా రూ.2016 కోట్ల బకాయి అన్నదాతలకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాకు లేఖ విడుదల చేశారు.

48 గంటల్లోనే..
పంట విక్రయించిన 48 గంటల్లో నగదు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను వంచించిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పంట విక్రయించి నెలవుతోన్నా ఇప్పటికీ కొందరు రైతులకు నగదు అందలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా బకాయి కూడా చెల్లించలేదని గుర్తుచేశారు. మంగళవారం నాటికి రైతులకు ప్రభుత్వం రూ.2016 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. దాదాపు లక్షమంది రైతులు నగదు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

అన్నదాత విలవిల..
పంట విక్రయించిన నగదు రాక, రబీ పంట ఎలా వేయాలో తెలియక రైతన్న విలవిలలాడిపోతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రైతుల పంటకు నగదు ఎప్పుడు చెల్లిస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకు 48 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమచేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. కానీ ఆ మాటే మరచిపోయారని, కానీ అన్నదాతలు మాత్రం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
Recommended Video


నెలవుతోన్నా..
పంట విక్రయించి నెల రోజులవుతున్నా చేతికి డబ్బులు రాకపోవడంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నారు. రబీ పంటకు వేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదని వాపోతున్నారు. మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి వస్తోందని బోరుమంటున్నాని పవన్ కల్యాణ్ వివరించారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రణాళిక లేకుండా ముందుకుసాగుతోందని విమర్శించారు. అన్నదాతలపై ప్రభుత్వం వ్యవహరించే తీరు సరికాదని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఇంతకీ ధాన్యం కొనుగోలు కోసం నిధులు కేటాయించారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిధులు కేటాయిస్తే ఎటువెళ్లాయో రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications