ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు: 5500కు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కొత్త కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, 500కి దిగువనే కేసులు నమోయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 41,820 నమూనాలను పరీక్షించగా.. 493 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 493 కరోనా కేసులు, ఏడుగురు మృతి

ఏపీలో కొత్తగా 493 కరోనా కేసులు, ఏడుగురు మృతి

కొత్తగా నమోదైన 493 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,62,303కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఏడుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,327కి పెరిగింది

ఏపీలో 5500కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో 5500కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 552 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,42,476కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 5,500 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,42,162 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 113 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అనంతపురంలో జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 06, చిత్తూరులో 113, తూర్పుగోదావరిలో 45, గుంటూరులో 74, కడపలో 24, కృష్ణాలో 56, కర్నూలులో 08, నెల్లూరులో 31, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 25, విజయనగరంలో 07, పశ్చిమగోదావరిలో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,049, చిత్తూరులో 2,46,156 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,890) కరోనా కేసులున్నాయి.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

    దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

    దేశంలో కరోనావైరస్ కేసులు తాజాగా, స్వల్పంగా పెరిగాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 12,47,506 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 18,454 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందురోజు కంటే కొత్త కేసుల్లో 26 శాతం మేర కేసులు పెరగడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లు దాటాయి. గత 24గంటల వ్యవధిలో 160 మంది మరణించగా, ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 4.52 లక్షలకు చేరింది. బుధవారం 17,561 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.34 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో 1,78,831కి చేరింది. కరోనా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గురువారం ఉదయంనాటికి కరోనా వ్యాక్సి్ తీసుకున్నవారి సంఖ్య 100 కోట్లు దాటింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+