శ్రీకాకుళంలో కామాంధుడు: మద్యం మత్తులో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

పలాస: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ కామాంధుడు అభం, శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ లోని ఓ గ్రామంలో ఒకటో తరగతి చదువుతున్న బాలికపై వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన సొండిపల్లి ధర్మారావు అలియాస్‌ జనార్దన్(40) అత్యాచారం చేశాడు.

గురువారం మధ్యాహ్నాం పుల్లుగా మద్యం సేవించిన ధర్మారావు మధ్యాహ్నా సమయంలో పాఠశాల వైపు వెళ్లాడు. భోజనం చేస్తున్న ఆ చిన్నారిని పిలిచి, చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానని బాలికకు మాయమాటలు చెప్పి అతని వెంట తీసుకెళ్లాడు. బాలికను తీసుకెళ్తున్న క్రమంలో గ్రామంలోని కొందరు అతన్ని చూశారు.

అయితే బాలిక తరుపు బంధువు అయి ఉంటాడని భావించి అతడివి ఎవరూ ప్రశ్నించలేదు. ఆ తర్వాత గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న అడవి ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక రోదిస్తున్నా ఆ కామాంధుడు కనికరం చూపలేదు.

5 year old Girl Raped in Srikakulam

భోజనానికి వెళ్లిన ఆ చిన్నారి ఇంకా పాఠశాలకు రాకపోవడంతో టీచర్లు గ్రామంలో వెతికి చివరకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో కంగారుపడిన గ్రామస్తులు, తల్లిదండ్రులు, టీచర్లు అంతా కలిసి అడవి ప్రాంతంలో వెతకగా బాలిక రోదిస్తూ కనిపించింది.

అదే సమయంలో ధర్మారావు అక్కడే ఉండటంతో ఏం జరిగిందంటూ అతడిని నిలదీశారు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం చేసినట్టు అతడు అంగీకరించడంతో గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షలకు తరలించారు.

నిందితుడు ధర్మారావును అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడుపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాము వెతకడం మరో గంట ఆలస్యమైతే, బాలికను హతమార్చి ఉండేవాడని వివరించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. చదువుకునే పిల్లలకు కూడా రక్షణ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+