వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో 52 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, నెలాఖరులోగా నియామకం, 12 మంది డైరెక్టర్లు: సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

52 రకాల బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులోపు చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తి కావాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టంచేశారు. తాడేపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్మన్లను నియమించడంతోపాడు 7 నుంచి 12 మంది డైరెక్టర్లు కూడా ఉంటారని స్పష్టంచేశారు. కులాల అభివృద్ది కోసం పాటుపడిన వారికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు స్పష్టంచేశారు.

బీసీలకు పెద్దపీట

బీసీలకు పెద్దపీట

రాష్ట్రంలో ప్రభుత్వం అందజేసే ప్రతీ పథకాన్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. నగదు బదిలీ కింద 2 కోట్ల 12 లక్షల పైచిలుకు బీసీలకు.. 22 వేల 685.74 కోట్లు అందజేశామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా బీసీల అభివృద్ది కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను వైఎస్ఆర్ చేయూత అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 25 లక్షల మంది మహిళలు పథకాలతో లబ్ది పొందారని గుర్తుచేశారు. ఇందులో ఎక్కువమంది బీసీ మహిళలే ఉన్నారని తెలిపారు.

18 నెలల్లో అప్ గ్రేడ్

18 నెలల్లో అప్ గ్రేడ్

లోక్ సభ నియోజకవర్గంలో సిల్క్ డెవలప్ మెంట్ సెంటర్ తీసుకొస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 18 నెలల్లో అప్ గ్రేడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పెద్ద కంపెనీలు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నాయని.. జర్మనీకి చెందిన సంస్థలు ఉన్నాయని చెప్పారు. బీసీలందరికీ నైపుణ్యాభివృద్ది శిక్షణ అందిస్తామని తెలిపారు.

35 వేల జనాభా గల కులానికి ఒక కార్పొరేషన్

35 వేల జనాభా గల కులానికి ఒక కార్పొరేషన్

2019లో ఎన్నికల సమయంలో 13 కార్పొరేషన్లు పెట్టారని కొందరు ఎమ్మెల్యేలు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిలో చాలా ఫెడరేషన్ కార్పొరేషన్లుగా మార్చారని తెలిపారు. అయితే జనాభా, స్థితిగతుల ప్రాతిపదికనా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. 30 నుంచి 35 వేల జనాభా ఉన్న కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదో ఒక కార్పొరేషన్‌లో ప్రతీ కులాన్ని చేర్చామని పేర్కొన్నారు.

Recommended Video

Mukesh Ambani Surpasses Warren Buffet In New Rich List | టాప్ 10 ధనికులు వీళ్ళే!! || Oneindia Telugu
మొత్తం 52 కార్పొరేషన్లు

మొత్తం 52 కార్పొరేషన్లు

10 లక్షలకు పైగల జనాభా ఉన్న కార్పొరేషన్లు ఆరు, లక్షకు పైగల కార్పొరేషన్లు 27, లక్షలోపు జనాభా గల కార్పొరేషన్లు 19 ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో కార్పొరేషన్ల సంఖ్య 52గా ఉంది. గతంలో 69 కులాలే పరిగణలో ఉండగా.. ఇప్పుడు 139 కులాలు చేర్చామని అధికారులు తెలిపారు.

English summary
52 bc corporation chairman will be Appointed by andhra pradesh government this month end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X